ముక్కోటి ఏకాదశి కి మంగళగిరి సర్వం సిద్ధం రెండు లక్షల మంది వస్తారని అంచనా..!

మంగళగిరి క్షేత్రంలో ముక్కోటి ఏకాదశి నాడు  'శంఖుతీర్ధం' ఇచ్చే సాంప్రదాయం ఇప్పటికి 197 సంవత్సరాల నుండి జరుగుతున్నది.1820 వ సంవత్సరంలో తంజావూరు మహారాజు' శ్రీ వెంకొజీ' బంగారం తొడుగుతో ఒక శంఖు ను ఈ క్షేత్రానికి బహూకరించారు. అప్పడు రాజావారు బహూకరించిన శంఖుతోనే ఇప్పటికీ..ప్రతియేటా ముక్కోటి ఏకాదశి నాడు 'తీర్ధం' ఇస్తున్నారు.2015 లో జనవరి 1 వ తారీఖు వచ్చిన ముక్కోటి ఏకాదశి నాడు..తిరుపతి వేంకటేశ్వరస్వామి వారి ఆలయాన్ని 60 వేల మంది భక్తులు సందర్శిస్తే..మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రాన్ని..1 లక్ష 10 వేల మందికి పైగా భక్తులు దర్శించుకుని శంఖుతీర్ధాన్ని స్వీకరించి తరించారు. రేపు మంగళగిరి కొండపైనగల 'గండాల నరసింహస్వామి' లేదా 'గండాలయస్వామి' వారిని  మెట్లమార్గం ద్వారా వేల సంఖ్యలో భక్తులు దర్శించుకొవడం ఈ పర్వదినాన మరొక ముఖ్యఘట్టం

#Mangalagiri

Post a Comment

 
Top