ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతమైన మంగళగిరి వద్ద ఉన్న ఎన్ ఆర్ టి టెక్ పార్కులో ఈరోజు 13 ఐటీ సంస్థలు కొలువయ్యాయి. మంత్రి నారా లోకేష్ చేతులమీదుగా ప్రారంభమైన ఈ సంస్థలలో సిగ్నం డిజిటల్ నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్, చారువికెంట్ ఐటీఈఎస్ ప్రైవేటు లిమిటెడ్, అద్వైత్ అల్గారిథం, స్క్రిప్ట్ బీస్ ఐటీ లిమిటెడ్, స్వరా సాఫ్ట్, సన్ స్వెట్, పిక్సీ, సువిజ్, డీఎఫ్ఐ స్విస్,ఆస్టోనా,
క్రేజీ టూన్జ్ యానిమేషన్ స్టూడియోస్, మహాత్రు మీడియా సొల్యూషన్స్, సాత్వికా డిజిటల్ నెట్ వర్క్స్ సంస్థలు ఉన్నాయి. 
ఇవి కాకుండా మంగళగిరి ఆటోనగర్‌ ఐటీ పార్కులో మరో మూడు సంస్థలను ఈరోజే లోకేష్ ప్రారంభించారు. వీటిల్లో హెల్త్ కేర్ ఐటీ సంస్థ మేక్ మై క్లినిక్ ఇండియా, ఐటీ ఆధారిత సేవలను అందించే ఎక్సెల్లర్ ఇన్ఫో సర్వీసెస్, బీవీజీ ఇండియా లిమిటెడ్ పేరుతో మరో ఐటీ ఆధారిత సంస్థలు ఉన్నాయి. 

మొత్తంగా ఈ 16 సంస్థల ఏర్పాటుతో తక్షణం 600 మందికి ఉపాధి లభిస్తుండగా... రానున్న ఏడాది కాలంలో మరో 1600 మందికి ఉద్యోగావకాశాలు ఏర్పడతాయి.  రాష్ట్ర యువత ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా రాజధాని అమరావతిలోనే ఐటీ ఉద్యోగాలను పొందేలా ప్రభుత్వం చేస్తున్న కృషికి ఇది నిదర్శనం.

Post a Comment

 
Top