రాజధాని అమరావతికి మరో రెండు ఐటీ కంపెనీలు వస్తున్నాయి. ఇంజినీరింగ్ డిజైనింగ్‌లో రాణిస్తున్న దేశీయ ఐటీ సంస్థ ‘క్యాడ్‌సిస్‌టెక్’ రాష్ట్రంలో కార్యకలాపాలు ప్రారంభించడానికి ముందుకొచ్చింది. ఈ సంస్థకు మంగళగిరిలోని ఐ డాటా సెంటర్‌కు సమీపంలో ఎకరా స్థలం కేటాయించారు. ఈ సంస్థ దాదాపు వెయ్యి మందికి ఉద్యోగావకాశాలు కల్పించనుంది. ఇప్పటికే క్యాడ్‌సిస్‌టెక్ తెలంగాణ రాష్ట్రంలో తన కార్యకలాపాలు కొనసాగిస్తోంది.
అలాగే 'అక్షర ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్' కూడా మంగళగిరిలో కార్యాలయం ఏర్పాటు చేస్తోంది. ఈ సంస్థకు అరఎకరా కేటాయించారు. దీని ద్వారా 300 మందికి ఉద్యోగావకాశాలు కల్పించనున్నారు. ఈ రెండు సంస్థలకు సంబంధించి ఈ నెల 24న ఐటీ మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేయనున్నారు.

Post a Comment