ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో, మంగళగిరి దగ్గర అత్యాధునిక హంగులతో ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియం రూపుదిద్దుకుంటోంది. ఆధునిక సాంకేతికతతో ఈ స్టేడియాన్ని తీర్చిదిద్దుతున్నారు. పనులు వేగంగా జరుగుతున్నాయి.
మొత్తం ఐదు లక్షల యాభై వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో స్టేడియం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. స్టేడియం తాలూకు గ్యాలరీలో దక్షిణం, ఉత్త రం బ్లాకులను ఐదు అంతస్తులుగాను, తూర్పు, పడమర బ్లాకులను మూడు అంతస్తులుగాను నిర్మిస్తున్నారు. వీటిలో మూడు బ్లాకులు పూర్తికాగా, ప్రస్తుతం నార్త్ బ్లాకు గ్యాలరీ పనులు కొనసాగుతున్నాయి.
2018 నాటికి నిర్మాణం పూర్తి చేసి, కొన్ని రంజీ మ్యాచులు ఆడి, 2019 నాటికి ఇంటర్నేషనల్ మ్యాచులు మొదలు పెట్టనున్నారు.
ఇవి హైలైట్స్:
  • 23.20 ఎకరాల విస్తీర్ణంలో స్టేడియం
  • 180 గజాల వ్యాసంలో ఉండే మైదానం మధ్య నుంచి బౌండరీ లైను 75 గజాల వ్యాసార్థంలో ఏర్పాటవుతోంది
  • గ్రౌండు చుట్టూ ఉండే అండర్‌గ్రౌండు డ్రెయినేజికి, బౌండరీలైనుకు మధ్య మళ్లీ 15 గజాల జాగా ఉంటుంది
  • మైదానంలో మొత్తం 11 పిచ్‌లను ఏర్పాటు చేయబోతున్నారు. ఈ పిచ్‌లు ఒక్కోటి 66 అడుగుల పొడవు, పదడుగుల వెడల్పుతో ఉంటాయి
  • అత్యాధునిక సాట్రమ్‌ వాటర్‌ డ్రెయిన్లతో, దాదపు 10 వేల లీటర్ల నీటిని బయటకు పంపే సామర్ధ్యం
  • 34 వేల మంది ప్రేక్షకులు కూర్చొనేందుకు గ్యాలరీ
  • 5 కోట్లతో నిర్మించిన ఇండోర్‌ స్టేడియం
  • మొత్తం ఖర్చు రూ.120 కోట్లు (అంచనా)


Post a Comment

 
Top