మంగళగిరి కొండ పైన గల.. ''గండ దీపం'' చరిత్ర.
_________________________________________________
......భారతదేశం లోని 108 ప్రముఖ వైష్ణవ క్షేత్రాలలో మంగళగిరి క్షేత్రం ఎంతో వైశిష్ట్యమైనది. మంగళగిరి ని ''మంగళాద్రి'' "తోటాద్రి'' గా స్ధలపురాణంలో వివరించబడినది.ఈ పవిత్రమైన క్షేత్రములో కొండ శిఖరాగ్రాన కొలువైయున్న ''గండాల నరసింహస్వామి'' కి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది.కొండపైన త్రిభుజాకారంలో పూర్వం ఒక కట్టడం ఏర్పాటుచేశారు....దానిలో ఒక దీపాన్ని ఉంచి..ఆదీపంలో ''ఆవునెయ్యి'' ని పోసి ప్రతిరోజూ వెలిగిస్తూ ఉంటారు.ఈదీపాన్నే ''గండదీపం'' లేదా ''గండాలయం'' గా వ్యవహరిస్తూ ఉంటారు.ఇక్కడ ఉన్న చిన్న నిర్మాణంలో వెలుగుతున్న ''దీపం'' మాత్రమే ఉంటుంది కానీ నరసింహస్వామి వారి విగ్రహం ఉండదు. కొండపైన ఉన్న ఈ గండదీపం కృతాయుగము నుండి వెలుగుతూ ఉందని పురాణాలను బట్టి తెలుస్తున్నది.రకరకాల సమస్యలతో బాదపడుతున్నవారు..ఈ గండదీపానికి ఆవునెయ్యి ని సమర్పించడం వలన బాదలు తొలగిపోయి సాంత్వన చేకూరుతుందని భక్తుల ప్రగాడ విశ్వాసం.కొండపైన గల ఈదీపం మంగళగిరి పరిసర గ్రామాల ప్రజలకు రాత్రిపూట కనిపిస్తూ ఉంటుంది.
మంగళగిరి పుణ్య క్షేత్రములో ముగ్గురు నరసింహ స్వాములు కొలువైయున్నారు.దిగువ సన్నిధియందు..శ్రీలక్ష్మీనరసింహస్వామివారు,కొండ మధ్యభాగమున శ్రీపానకాల స్వామివారు(ప్రక్క ఫోటోలోని విగ్రహం), కొండ శిఖరాగ్రాన ''గండాల'' నరసింహ స్వామివారు. మంగళగి తిరుణాళ,మరియు ముక్కోటి ఉత్సవాల సమయంలో అధికసంఖ్యలో భక్తులు కొండపైన గల గండాల నరసింహ స్వామివారిని దర్శించుకుని..గండదీపానికి ఆవునెయ్యి ని సమర్పిస్తూ ఉంటారు.గండాల నరసింహ స్వామిని చేరుకోవడానికి కొండమధ్యభాగంలో ఉన్న పానకాలస్వామి ఆలయంవరకు ఘాట్ రోడ్డు ద్వారా వెళ్ళి..అక్కడినుండి మెట్లమార్గం ద్వారా కాలినడకన చేరుకోవచ్చు.
భక్తులను గండాల నుంచి గట్టెంకించే స్వామి కనుక గండాల నరసింహస్వామి ''గండాల రాయుడు'' గా ప్రసిద్ది చెందారు.
మేకల మోహనరావు
ప్రెసిడెంట్..శ్రీలక్ష్మీనరసింహా ఎడ్యుకేషనల్ సొసైటీ
మంగళగిరి
Post a Comment